kadapa dist news : e crop గడువును పెంచాలి - Rythu Seva Samithi

 kadapa dist news : e crop గడువును పెంచాలి - Rythu Seva Samithi 

kadapa dist news : e crop గడువును పెంచాలి - Rythu Seva Samithi


ప్రభుత్వం రైతుల పంటసాగు నమోదు కార్యక్రమం ఐన, e-crop నమోదు కార్యక్రమ నమోదు గడువును, పెంచాలని రైతు సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఎ వి రమణ, మస్తాన్ రావులు ఓ ప్రకటనలో కోరారు.  కడప జిల్లాలో ఈ సంవత్సర ఖరీఫ్లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో,  రైతులు సరైన సమయంలో పంటను సాగు చేయలేక పోయారని,  ఖాజీపేట మండలం, మరికొన్ని ప్రాంతాల్లో కేసీకెనాల్ రైతులు, వరినాట్లు వేయడం గత రెండు మూడు రోజుల కిందట మొదలైనవి అని తెలిపారు. ఇవి పూర్తి కావాలంటే పది నుంచి పదహైదు రోజుల సమయం పడుతుందని అన్నారు. ఆరుతడి పంటలు సాగుచేసునే వర్షాధార సాగు కూడా, ఈ ఏడు ఆలస్యం అవుతున్నదని, సరైన పదును వర్షం లేక చాలామంది రైతులు పంటలను వేసుకోలేక పోయారన్నారు. కాగా గత రెండు మూడు రోజుల కిందట జిల్లాలో పంట వేసుకునేందుకు సరిపడా వర్షం పడడంతో, మెట్టసాగు రైతులు పంట  సాగు పనులు మొదలు పెట్టారని, కావున kadapa జిల్లాలో ప్రభుత్వం e-crop పంట నమోదు కార్యక్రమాన్ని, రానున్న అక్టోబర్ 10వ తేదీ వరకు గడువు పెంచి నమోదు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమస్యతో పాటు, జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యల పైనా  Rythu Seva Samithi ఈనెల 30వ తేదీ, సోమవారం రోజు కడప కలెక్టర్ కార్యాలయం దగ్గర, నిరసన కార్యక్రమం చేపట్టనున్నదని, వారు తెలిపారు. రైతులు రైతు శ్రేయోభిలాషులు, సోమవారం ఉదయం 10 గంటలకు kadapa కలెక్టర్ కార్యాలయం చేరుకోవాలని వారు కోరారు.
ఈ వార్త వీడియో వీక్షణకు ఈ లింక్ క్లిక్ చేయండి video

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

KADAPA ZP CHAIRMAN : కారుణ్య నియామకాల పత్రాలను అందజేసిన జెడ్పీ చైర్మన్ MUTYALA RAMA GOVINDA REDDY

Early Life of PM Narendra Modi - (Birth to 15 Years) APSAHAYANEWS

AP New Ration Card - ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర ప్రజలకు GOOD NEWS : రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న New Ration Card దరఖాస్తు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్